హృదయం లాంటి గీతం

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ’. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘జనని’ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోల్‌ ఆంథెమ్‌’ పేరుతో విడుదల చేస్తున్న ఈ సాంగ్‌ స్పెషల్‌ స్ర్కీనింగ్‌ను గురువారం మీడియా కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా రాజమౌళి మాట్లాడుతూ ‘జనని’ సాంగ్‌ ఈ సినిమాకి హృదయంలాంటిది. ఈ పాటలో అంతర్లీనంగా హృదయాలను కదిలించే ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ పాటను మీ ముందుకు తెస్తున్నందుకు గర్వంగా ఉంది’ అన్నారు. ఈ గీతానికి కీరవాణి సంగీతంతో పాటు లిరిక్స్‌ అందించడం విశేషం. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement