Viral Video: వధువు మెడలో పూలమాల వేసిన వరుడు.. ఆ తర్వాత అతడు చేసిన పనికి పెళ్లికూతురు సహా అంతా షాక్..

ABN , First Publish Date - 2022-02-25T00:35:33+05:30 IST

నూతన వధూవరులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో వరుడు చేసిన ఓ పనికి వధువు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక

Viral Video: వధువు మెడలో పూలమాల వేసిన వరుడు.. ఆ తర్వాత అతడు చేసిన పనికి పెళ్లికూతురు సహా అంతా షాక్..

ఇంటర్నెట్ డెస్క్: నూతన వధూవరులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో వరుడు చేసిన ఓ పనికి వధువు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాతో అదికాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. వరుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వారిద్దరి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్ద నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసి, ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వారిద్దరికీ పెళ్లి చేశారు. వివాహానంతరం రిసెప్షెన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నూతన వధూవరులు ఇద్దరూ స్టేజీ మీదకు వచ్చారు. ఫొటోలు దిగడానికి ముందు.. వరుడి మెడలో తొలుత వధువు పూలమాల వేసి, అతడి కాళ్లు మొక్కింది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో పూలదండ వేశాడు. ఆ తర్వాత అతడు కూడా వధువు కాళ్లకు నమస్కరించాడు. దీంతో ఆ వధువు ఒక్కసారిగా అవాక్కైంది. వెంటనే వరుడికి దూరంగా జరిగింది. వరుడు చేసిన పనికి అక్కడున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కష్టసుఖాల్లో జీవితాంతం తనకు తోడుగా ఉండనున్న వధువు కాళ్లు మొక్కిన వరుడిపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-02-25T00:35:33+05:30 IST