విద్యార్థుల భవిష్యత్‌కు చక్కటి అవకాశం

ABN , First Publish Date - 2021-12-04T04:59:36+05:30 IST

ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అందజేస్తున్నదని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ యాదయ్య తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్‌కు చక్కటి అవకాశం
అవగాహన కల్పిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ యాదయ్య

- షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ యాదయ్య 


బాదేపల్లి, డిసెంబరు 3 : ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అందజేస్తున్నదని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ యాదయ్య తెలిపారు. శుక్రవారం బాదేపల్లి జడ్పీహెచ్‌ బాలుర పాఠశాలలో మండల స్థాయి హెచ్‌ఎంలకు ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఆదాయం, కులం, బ్యాంక్‌ ఖాతాతో ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్బన్‌ విద్యార్థులకు సంవత్సర ఆదాయం రూ.2లక్షలు, రూరల్‌ విద్యార్థులకు రూ. లక్షా 50 వేలు ఉండాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ అధికారులు ఇందిర, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి చత్రు నాయక్‌, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి శంకరాచారి, ఎంఈవో మంజులాదేవి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T04:59:36+05:30 IST