హనుమత్‌ జయంతి ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ

ABN , First Publish Date - 2022-05-23T05:09:38+05:30 IST

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే హనుమత్‌జయంతి ఉత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ చేశారు.

హనుమత్‌ జయంతి ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ
హనుమత్‌ జయంతి ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తున్న దృశ్యం

చక్రాయపేట, మే 22: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే హనుమత్‌జయంతి ఉత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ప్రధాన అర్చకులు కేస రి, రాజారమే్‌ష శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన, వాస్తు హోమం, గోష్టి తదితర కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు. 25న మహాపూర్ణాహుతి ఉం టుందని తెలిపారు. సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి, చైర్మన్‌ పినుపోలు రాఘవేంద్రసాద్‌, అర్చకులు గోపాలస్వామి, వేదపారాయణ పండితులు రామ్మోహన్‌శర్మ, రఘుస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:09:38+05:30 IST