ఘనంగా పీర్ల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-08T05:41:24+05:30 IST

ఉమ్మడి జిల్లాలోనే గూగుడు కుళ్లాయిస్వామి మొహర్రం వేడుకల తర్వాత బత్తలపల్లి ఖాశీంస్వామి వేడుకలు జరు గుతాయి.

ఘనంగా పీర్ల ఊరేగింపు
జక్కంపూటి వెంకటేష్‌ సమాధి వద్ద కొబ్బరికాయ కొడుతున్న ఖాశీంస్వామి


బత్తలపల్లి, ఆగస్టు7: ఉమ్మడి జిల్లాలోనే గూగుడు కుళ్లాయిస్వామి మొహర్రం వేడుకల తర్వాత బత్తలపల్లి ఖాశీంస్వామి వేడుకలు జరు గుతాయి. మొహర్రం సందర్భంగా ఆదివారం విడిదినం కార్యక్రమాన్ని తెల్లవారజామునే ఖాశీంస్వామి భక్తులకు దర్శనం ఇస్తూ పురవీధుల గుం డా ఊరేగింపుగా వచ్చారు. గ్రామ పినపెద్ద జక్కంపూటి వెంకటేష్‌ సమాధి వద్ద ఖాసింస్వామి  కొబ్బరికాయకొట్టే దృశ్యాన్ని భక్తులు భారీగా తరలివ చ్చి  తిలకించారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత భక్తులు సమాధికి నమస్క రించి  అక్కడి బండారు తీసుకునేందుకు పోటీపడ్డారు. అనంతరం స్వామి తమ్ముళ్లుగా భావించే గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాలకు వెళ్లగానే ఆ పీర్లు ఖాసింస్వామితో సలామ్‌(బేటీ) తీసుకున్నాయి. ఆయా గ్రామాల్లో ఊరేగి మంగళవారం జరిగే పెద్ద భేటీ కార్యక్రమానికి రావాలని తన తమ్ముళ్లను ఖాశీంస్వామి ఆహ్వానించారు. తన సమస్యలను పరిష్క రించాలని, కోర్కెలు నెరవేర్చాలని ఆయా గ్రామాల్లో భక్తులు బత్తలపల్లి ఖాసింస్వామి ఎదుటు కూర్చొని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలు బంధువులతో కిటకిటలాడాయి. 

కార్యక్రమంలో పెద్దలు జక్కంపూటి సత్యనారాయణ, నాగభూషణం, నలజాల తిరుపాల్‌, జయప్ప, పురుషోత్తం, పురుషోత్తంచౌదరి, గడుపూటి బాబు, నాగార్జునరెడ్డి, ముత్యాలు, చంద్ర, సుధీర్‌, బడారెడ్డి, వెంకటరెడ్డి, కాశీంవలి, ఈశ్వరయ్య, నాయుడు, వెంకటపతి, అప్పస్వామి, గోపాల్‌, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:41:24+05:30 IST