ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-16T06:44:03+05:30 IST

మూడేళ్లకే ప్రజా విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని, జగన్‌ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. కడప నగరం 41, 42, 43 డివిజన్లలో టీడీపీ నేత కె.ఎ్‌స.బర్కతుల్లా ఆధ్వర్యంలో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు

బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు

కడప (ఎర్రముక్కపల్లి), మే 15 : మూడేళ్లకే ప్రజా విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని, జగన్‌ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. కడప నగరం 41, 42, 43 డివిజన్లలో టీడీపీ నేత కె.ఎ్‌స.బర్కతుల్లా ఆధ్వర్యంలో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు, ప్రజలపై మోపుతున్న భారాలు, కరెంట్‌ కోతలు తదితర అంశాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కరెంట్‌ చార్జీలు పెంచలేదని జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఆరుసార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెట్రోల్‌, డీజల్‌పై అదనపు సుంకాలను విధించి పేద, మధ్య తరగతి ప్రజల జీవితాన్ని నాశనం చేశారన్నారు. ఇలాంటి మోసపూరిత అబద్ధపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు రావడమే తరువాయి అని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, నాయకులు పీరయ్య, జిలానీబాషా, గుర్రప్ప, వికా్‌స హరి, రాజశేఖర్‌, రాంప్రసాద్‌, నగర మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:44:03+05:30 IST