ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-25T05:48:55+05:30 IST

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం
ప్రజలతో మాట్లాడుతున్న గౌరు చరిత

బాదుడే.. బాదుడులో మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, సెప్టెంబరు 24: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం 41వ వార్డు వీకర్‌ సెక్షన్‌ కాలనీ నాగులకట్ట నుంచి నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ ఆధ్వర్యంలో చేపట్టిన బాదుడే..బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ పేదలపై పన్నులు, చార్జీలు పెంచుతు న్నారని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. వార్డులలో రోడ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రజలు పందులు, ఈగలు, దోమలు, విషసర్పాలు బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆమె వెంట జనార్దన్‌ఆచారి, కాసాని మహేష్‌ గౌడు, గంగాధర్‌గౌడు, అంజి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T05:48:55+05:30 IST