గ్రోయిన్‌ను గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-03T05:58:52+05:30 IST

బాహుదా నదిపై ఉన్న గ్రోయిన్‌ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో రాతికట్టు పూర్తిగా పాడైపోయింది. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. శివారు ఆయకట్టుకు సాగునీరందడం లేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. దాదాపు 1,800 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం

గ్రోయిన్‌ను గాలికొదిలేసిన ప్రభుత్వం
శ్రమదానం చేసి రాతికట్టుకు అడ్డంగా ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యం

శ్రమదానం చేసి బాగుచేసుకున్న రైతాంగం

ఇచ్ఛాపురం, ఆగస్టు 2 : బాహుదా నదిపై ఉన్న గ్రోయిన్‌ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో రాతికట్టు పూర్తిగా పాడైపోయింది. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. శివారు ఆయకట్టుకు సాగునీరందడం లేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. దాదాపు 1,800 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 1,000 మంది రైతులు తలో చందాలు పోగుచేసుకొని గ్రోయిన్‌ మరమ్మతు పనులకు శ్రీకారంచుట్టారు. మంగళవారం 3,500 ఇసుక బస్టాలతో గట్టు నిర్మాణం చేపట్టారు. ఇందుకుగాను రూ.50 వేలు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సొంత నిధులతో శ్రమదానం చేసి బాగుచేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 




Updated Date - 2022-08-03T05:58:52+05:30 IST