ప్రజల భాగస్వామ్యంతో మంచిర్యాంకు సాధించవచ్చు

ABN , First Publish Date - 2020-10-23T10:49:57+05:30 IST

ప్రణాళికాబద్ధంగా ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ పరిశుభ్రతకు కృషిచేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో మంచిర్యాంకు సాధించవచ్చని కలెక్టర్‌ శశాంక అన్నారు

ప్రజల భాగస్వామ్యంతో మంచిర్యాంకు సాధించవచ్చు

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, అక్టోబరు22 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): ప్రణాళికాబద్ధంగా ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ పరిశుభ్రతకు కృషిచేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో మంచిర్యాంకు సాధించవచ్చని కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డితో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021, పబ్లిక్‌ టాయిలెట్లు, నర్సరీల పనులు, స్ర్టీట్‌ వెండర్లలోన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో వచ్చిన ర్యాంకులో ఉన్న మార్కుల ఆధారంగా మనం ఇంకా మెరుగుపరుచుకోవలసిన అంశాలపై దృష్టి పెడుతూ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించగలిగితే మంచిర్యాంకు పొందవచ్చని అన్నారు. సామూహిక ప్రజా మరుగుదొడ్లను నవంబర్‌ 13న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నాటికి పూర్తి చేసి మరింత మందికి ఉపయోగపడేలా చూడాలని తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలోగా అన్ని పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయని కాంట్రాక్టర్లకు నోటీసులు అందజేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.ఇప్పటి నుంచే మొక్కల పెంపకం ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం వరకు 1-2మీటర్లు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.


ఆ మొక్కలు వందశాతం నాటుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు. స్ర్టీట్‌ వెండర్లకు వందశాతం లోన్లు మంజూరయ్యే విధంగాచూడాలని అధికారులను ఆదేశించారు. అందు కనుగుణంగా బ్యాంకర్లతో కలిసి బ్రాంచీల వారీగా లోన్లు మంజూరు చేయించి పంపిణీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి లోన్లను వందశాతం మంజూరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌(పరిపాలన) నరసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మాపీడీ రవీందర్‌, కిషన్‌స్వామి, అధికారులు, మున్సిపల్‌ ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T10:49:57+05:30 IST