అమ్మవారి యాగశాలపై బంగారు కలశం

ABN , First Publish Date - 2022-01-22T04:03:27+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చేపట్టిన నూతన యాగశాల నిర్మాణ పనులు కొనసాగు తున్నాయి.

అమ్మవారి యాగశాలపై బంగారు కలశం
కలశానికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు, వేదపండితులు, ఈవో లవన్న


శ్రీశైలం, జనవరి 21: శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చేపట్టిన నూతన యాగశాల నిర్మాణ పనులు కొనసాగు తున్నాయి. యాగశాల నిర్మాణదాత హైదరాబాద్‌కు చెందిన బుట్టా పర్వతయ్య, శారదాదేవి  సహకారంతో ఈ యాగశాల నిర్మాణ పనులను దేవస్థానం చేపట్టింది. ఈ నెల 12 వతేదీ యాగశాల పైకప్పు పనులను పారంభించారు. శనివారం యాగశాల మండపం విమానంపై నెలకొల్పేందుకు బంగారు శిఖరం( బంగారుపూత పూయబడిన కలశం) సిద్ధం చేశారు. ఆలయ రాజగోపురం వద్ద బంగారు కలశానికి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తకంగా పూజాధికాలు జరిపించారు. అనంతరం మేళతాళాలతో కలశాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పునఃపూజలు నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ ఈవో ఎస్‌. లవన్న, దాత దంపతులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T04:03:27+05:30 IST