14ఏళ్ల అమ్మాయి.. ఉదయాన్నే కంగారు పడుతూ హాస్టళ్ల కోసం ఆరా.. వాలకం తేడాగా ఉందని పోలీసులకు ఫోన్ చేసిన ఆటో డ్రైవర్.. చివరికి

ABN , First Publish Date - 2022-01-31T01:09:50+05:30 IST

ఆటో డ్రైవర్ ఎప్పటిలాగే ఉదయాన్నే అడ్డా మీదకు చేరుకున్నాడు. ప్యాసింజర్‌ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. 14ఏళ్ల అమ్మాయి అకస్మాత్తుగా అక్కడకు వచ్చింది. కంగారు పడుతూనే హాస్టళ్లు, హోటల్ గదు

14ఏళ్ల అమ్మాయి.. ఉదయాన్నే కంగారు పడుతూ హాస్టళ్ల కోసం ఆరా.. వాలకం తేడాగా ఉందని పోలీసులకు ఫోన్ చేసిన ఆటో డ్రైవర్.. చివరికి

ఇంటర్నెట్ డెస్క్: ఆటో డ్రైవర్ ఎప్పటిలాగే ఉదయాన్నే అడ్డా మీదకు చేరుకున్నాడు. ప్యాసింజర్‌ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. 14ఏళ్ల అమ్మాయి అకస్మాత్తుగా అక్కడకు వచ్చింది. కంగారు పడుతూనే హాస్టళ్లు, హోటల్ గదుల కోసం ఆటో డ్రైవర్‌ను ఆరా తీసింది. వాలకం తేడాగా ఉందని బావించిన ఆటో డ్రైవర్.. ఐడీ కార్డు చూపించమని కోరాడు. దీంతో ఆ యువతి మరింత కంగారు పడింది. తరువాత ఆ ఆటో డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని తేల్చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన రాజు కర్వాడే (35) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం కొన్నేళ్లుగా ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో  ఎప్పటిలాగే శనివారం ఉదయాన్నే ఆటో తీసుకుని అడ్డా వద్దకు వెళ్లాడు. రాజు ప్యాసింజర్‌ల కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా అతడి వద్దకు 14ఏళ్ల అమ్మాయి వచ్చింది. ‘దగ్గర్లో లేడీస్ హాస్టళ్లు కానీ, హోటళ్లు కానీ ఉన్నాయా? ఉంటే నన్ను అక్కడ డ్రాప్ చెయ్’ అంటూ కోరింది. ఆ అమ్మాయి కంగారు పడటాన్ని గమనించిన రాజు.. ఐడీ కార్డు చూపించాలని కోరాడు. దీంతో ఆ యువతి మరింత కంగారుపడింది. ఈ క్రమంలో అనుమానం వ్యక్తం చేసిన రాజు.. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని ఆమెను ఎంక్వైరీ చేశారు. దీంతో ఆ యువతి నిజం బయట పెట్టేసింది.


తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని పుష్ప్ విహార్‌లో నివసిస్తానని.. చదువు పేరుతో తన తల్లి ఎప్పుడూ ఒత్తిడి చేస్తుందని పేర్కొంది. ఆమె పోరు పడలేక.. ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టు వెల్లడించింది. దీంతో మహారాష్ట్ర అధికారులు.. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు. విషయం చెప్పి, మహారాష్ట్రకు రావాల్సిందిగా కోరారు. అనంతరం.. 14ఏళ్ల అమ్మాయిని తన తండ్రికి అప్పగించారు.




Updated Date - 2022-01-31T01:09:50+05:30 IST