సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-08-20T05:04:46+05:30 IST

చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా కొనసాగింది. ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవో గణే్‌షరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు.

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
మాట్లాడుతున్న ఎంపీపీ భాగ్యలక్ష్మి

 గైర్హాజరైన అధికారులు

 ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ భాగ్యలక్ష్మి 

చిన్నశంకరంపేట, ఆగస్టు 19: చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా కొనసాగింది. ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవో గణే్‌షరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమయ పాలన పాటించకుంటే చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి సమస్యలు తెలుపాల్సిన వారు సమావేశానికి ఎందుకు హజరు కాలేదో వివరణ ఇవ్వాలన్నారు. అనంతరం పలు సమస్యలపై ఎంపీటీసీలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వరదల ఉధృతితో పంటలు దెబ్బతిన్నాయని నేటికి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించలేదని ఏవో ప్రవీణ్‌పై చందంపేట ఎంపీటీసీ శివకుమార్‌ మండిపడ్డారు. రైతుల సమస్యలు పట్టించుకోని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్‌ కోతలతో పంటలు వాడిపోతున్నాయని విద్యుత్‌ అధికారులను పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు నిలదీశారు. అధికారులు, పలువురు సర్పంచులు సర్వసభ్య సమావేశానికి హజరు కాకపోవడంతో సమావేశం వెలవెలబోయింది. సమావేశంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, డాక్టర్‌ శ్రావణి, ఎంపీటీసీలు శివకుమార్‌, అనురాధ, సునీత, రాణమ్మ, ప్రసాద్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఫరీద్‌, సక్కుబాయి, సర్పంచులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:04:46+05:30 IST