న్యూయార్క్ వీధుల్లో నోట్ల వర్షం.. విషయం ఏంటంటే!

ABN , First Publish Date - 2021-04-19T17:08:30+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో నోట్ల వర్షం కురిసింది. దీంతో వాటిని ఏరుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏడాది

న్యూయార్క్ వీధుల్లో నోట్ల వర్షం.. విషయం ఏంటంటే!

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో నోట్ల వర్షం కురిసింది. దీంతో వాటిని ఏరుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ క్రమంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడి మరణించిన తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి వింత పని చేశాడు. కట్టలకొద్ది డబ్బును తీసుకొచ్చి న్యూయార్క్ వీధుల్లో వెదజల్లాడు. కరోనా కాటుకు గత ఏడాది తన మిత్రుడు మరణించడాని.. అతని జ్ఞాపకార్థం డబ్బును వెదజల్లుతున్నట్టు పేర్కొన్నాడు. దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనాలు ఎగబడ్డారు. ఈ దృశ్యాలన్నీ స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-04-19T17:08:30+05:30 IST