రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-08-14T05:11:02+05:30 IST

ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో జాతీయ జెండా రెపరెపలాడింది.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
పుట్టపర్తి ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

పుట్టపర్తిరూరల్‌, ఆగస్టు 13 : ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో జాతీయ జెండా రెపరెపలాడింది. శనివారం ఉదయం కలెక్టర్‌ బసంతకుమార్‌ కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, ప్రభుత్వా ధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, పోలీసుసిబ్బంది, జాతీయ జెండా లను చేతబూని కలెక్టరేట్‌ నుంచి చిత్రావతి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 125 అడుగు ల జాతీయ జెండా ప్రదర్శన ఆకట్టుకుంది. జగరా జుపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆజాదీకా అమృత మహోత్సవ్‌  నేపథ్యంలో 75 సంవత్స రాల ఆకృతిగా నిలబడ్డారు.   ధర్మవరంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్డీఓ తిప్పేనాయక్‌, తహసీ ల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ నీలకం ఠారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు 75 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలోని బ్లూమూన జూనియర్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కుటాగుళ్లలో ర్యాలీ నిర్వహించారు. అలాగే పట్నం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో 75 సంఖ్యలో కూర్చోని విద్యార్థులు ఆకట్టుకున్నారు. ధర్మవరం పరిధిలోని  పోతులనాగేపల్లి ప్రాథమికోన్నత పాఠ శాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అమడ గూరు మండలం గాజులపల్లి సమీపంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌  విద్యార్థులు ర్యాలీ నిర్వహిం చారు.  ముదిగుబ్బలో జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహిం చారు. విద్యార్థులు దేశ నాయకుల వేషం ధరించారు. బస్టాండ్‌ కూడలిలో మావనహారంగా ఏర్పడ్డారు. బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటాచలపతి, ఎంపీపీ వనజా శ్రీనివాసరెడ్డి జెండా ఎగురవేశారు. ఓబుళ దేవరచెరువు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ శ్రీధర్‌,  ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పొలప్ప జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నల్లమాడ పోలీస్‌ స్టేషనలో సీఐ నీరంజనరెడ్డి  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 


Updated Date - 2022-08-14T05:11:02+05:30 IST