Abn logo
Jul 31 2021 @ 00:04AM

టెక్కలిలో నకిలీ నోట్ల కలకలం

టెక్కలిలో బయటపడిన నకిలీ నోట్లు

  ఆందోళనలో  ప్రజలు, చిరువ్యాపారులు

  ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని బాధితులు 

(టెక్కలి రూరల్‌)


డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో 100, 200 రూపాయల నకిలీ నోట్లు కలకలం రేపుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ నోట్లు మార్కెట్‌లో విచ్చలవిడిగా చెలామణిలోకి వస్తుండడంతో సామాన్య ప్రజలు, చిరువ్యాపారులు ఆందో ళనకు గురౌతున్నారు. మండలంలోని పలు గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రకాల వ్యాపార అవసరాల కోసం, పనుల కోసం ప్రజలు టెక్కలి వస్తుంటారు. ఈ నోట్లు చెలామణి పట్టణంలోనే జరుగుతుందా? లేక గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుందా? అన్నది తెలియరావడంలేదు. వివిధ రకాల లావాదేవీల నిమి త్తం బ్యాంకుకు వెళ్లే సంద ర్భాల్లో ఈ వ్యవహారం బయటప డుతుండడంతో బాధితు లు లబోదిబోమంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే నకిలీ నోట్లతో నష్టపోయిన తమకు మళ్లీ పోలీసులు, కేసులు అంటే తలనొప్పి అన్న కారణంతో ఫిర్యాదు చేసేం దుకు జంకుతున్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న తాము ఈ నకిలీ నోట్లతో మరింత నష్టపో వాల్సి వ స్తుందని చిరు వ్యాపారులు వా పోతున్నారు. లావాదే వీల సమయంలో తక్కువ విలువ గల 100, 200 నోట్లను ఇ స్తుండడంతో వాటిని అంత పరిశీల నగా చూడడం లేదు. ఆ తరువాత అవి నకిలీ నోట్లు అని తెలిసి లబోదిబోమంటు న్నారు. ఇప్పటికైనా అధికారులు నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయా లని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.

  మా దృష్టికి వచ్చింది

పట్టణంలో చెలామణి అవుతున్న 100, 200 రూపాయల నకిలీ నోట్ల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనివెనుక ఎవరు ఉన్నారో ఆరా తీస్తున్నాం. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసు కుంటాం. కొనుగోలుదారులు, చిరువ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.  

 - ఎన్‌.కామేశ్వరరావు, ఎస్‌ఐ, టెక్కలి