ప్రాణహిత నదికి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-08-17T04:22:35+05:30 IST

మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదిలి పెట్టడంతో ప్రాణహిత నదికి భారీగా వరద నీరు చేరి బ్యాక్‌ వాటర్‌ అంతా పంట పొలాల్లోకి చేరింది.

ప్రాణహిత నదికి పోటెత్తిన వరద
తలాయి- పాత సోమిని మధ్య నీట మునిగిన వంతెన

బెజ్జూరు, ఆగస్టు 16:మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదిలి పెట్టడంతో ప్రాణహిత నదికి భారీగా వరద నీరు చేరి బ్యాక్‌ వాటర్‌ అంతా పంట పొలాల్లోకి చేరింది. తలాయి, పాత సోమిని గ్రామాల మధ్య వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగి పోవడంతో పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, సుస్మీర్‌, సోమిని, పాత సోమిని, నాగెపల్లి, బండలగూడ, చింతలపల్లి, మొగవెల్లి, ఇప్పలగూడ తదితర గ్రామాలకు రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. 

Updated Date - 2022-08-17T04:22:35+05:30 IST