ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలి

ABN , First Publish Date - 2022-08-13T05:17:54+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహో త్సావాల్లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం లో ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్లపై జాతీయ జెండా లను ఎగుర వేయాలని అధికారులు సూచించారు.

ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలి
పీలేరులో 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

బి.కొత్తకోట, ఆగస్టు 12 : ఆజాదీకా అమృత్‌ మహో త్సావాల్లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం లో ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్లపై జాతీయ జెండా లను ఎగుర వేయాలని అధికారులు సూచించారు. ఆమేరకు శుక్రవారం బి.కొత్తకోటలో స్థానిక పీటీఎం రోడ్డులోని  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకు లు, విద్యార్థులు, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేత పట్టుకుని పురవీదుల్లో భారీ ర్యాలీ, మానవహారంగా నిర్వహించారు.  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జ్‌  ప్రిన్సిపాల్‌ వెంకటేష్‌, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అంజాద్‌అలీఖాన్‌, అధ్యాపకులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

ములకలచెరువులో: హర్‌ ఘర్‌ తిరంగ్‌లో భాగం గా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎంపీడీవో రమేష్‌బాబు సూచిం చారు. ప్రతి ఇం టికి పంపిణీ నిమిత్తం 6024 జాతీయ పతాకాలను, వాటికి సంబంధించిన కర్రలను శుక్రవారం సంబంధిత పంచాయతీ కార్య దర్శులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ జవహార్‌బాబు, కార్యదర్శులు సమరసింహారెడ్డి, ఇబ్రహీం,  సిబ్బంది ఈశ్వర్‌, నాయకులు వెంట్రామి రెడ్డి, టంగుటూరి విశ్వనాధ్‌, కేశవరెడ్డి పాల్గొన్నారు. 

పెద్దతిప్పసముద్రంలో : ఆజాదీకా అమృత్‌ మహో త్సవ్‌లో భాగంగా శుక్రవారం స్థానిక పీటీఎం బస్టాండ్‌ కూడలిలో విద్యార్థులు, ఉపాధ్యా యులు, ప్రజా ప్రతినిధులు మానవహారంగా ఏర్పడి భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.  జాతీయ జెండాలతో  పురవీధుల్లో  ర్యాలీ చేశారు.  కార్యక్రమంలో ఎం ఈవో నారాయణ, ఎంపీపీ మహమూద్‌, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

నిమ్మనపల్లెలో: ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వ హించి  బస్టాండు కూడలిలో మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లీలామాధవి మాట్లాడుతూ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లపైన ఎగరవేయాలన్నారు. 

తంబళ్లపల్లెలో: స్థానిక ప్రాథమి కోన్నత పాఠశా ల విద్యార్థులు జాతీయ జెండాలను చేతభూని భార త మాతాకీ జై అంటూ  ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. కార్య క్రమంలో పోర్డు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె ఆరోగ్య ఉపకేం ద్రంలో వైద్య సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించి గౌర వ వందనం చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెం ట్‌ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం విజ య, కవిత, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ 

పీలేరు, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా పీలేరులోని జడ్పీ ఉన్నత పాఠ శాల(మెయిన్‌), ప్రభుత్వ ఉన్నత పాఠశా ల విద్యార్థులు 500 అడుగుల జాతీయ జెండాతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా పలువురు చిన్నారులు జాతీయ నాయ కుల వేషధారణలో పట్టణంలో చేపట్టిన ర్యాలీ అంద రినీ ఆకట్టుకుంది.  స్థానిక సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది.  కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.సుధాకర్‌రెడ్డి, హెచ్‌ ఎంలు రంగనాథరెడ్డి, చంద్రనాగమణి, ఉపాధ్యా యులు రవి, రెడ్డప్ప, పోతంశెట్టి రమేశ్‌, నటరాజన్‌, రమణ, కిశోర్‌, ఉషారాణి  పాల్గొన్నారు.

గుర్రంకొండలో:గుర్రంకొండ కోటలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ శుక్రవారం విద్యార్థులతో కలిసి పురావస్తుశాఖ అధికారులు నిర్వ హించారు. ఇందులో భాగంగా స్థానిక జడ్పీ హైస్కూల్‌ నుంచి కోట వరకు దేశ భక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రినాథ్‌, హర్ష, సిబ్బంది రామూర్తిలు పాల్గొన్నారు.

కలికిరిలో: కలికిరి పట్టణంలో శుక్రవారం జాతీయ జెండాలతో జరిగిన భారీ ర్యాలీ పలువురిని ఆకట్టు కుంది. కలికిరి సర్పంచు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఆధ్వ ర్యంలో పట్టణంలోని పలు విద్యా సంస్థలు, సీఆర్పీ ఎఫ్‌ జవాన్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  పాఠశాలల ఉపాధ్యాయులు, సీఆర్పీలు సురేష్‌, మురాద్‌షా, జవాన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.  

వాల్మీకిపురంలో:  స్థానిక ఎన్‌టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మండలంలోని గండబోయనపల్లెలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశా ల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాలు, స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలతో ప్రదర్శన చేపట్టారు.  కార్యక్రమాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి, హెచ్‌ఎంలు వెంకటరత్నం, శ్రీనివాస్‌, జేవీవీ అధ్యక్షుడు ప్రభుచరణ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-13T05:17:54+05:30 IST