బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-03T05:20:59+05:30 IST

బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం


కులకచర్ల, జూలైౖ2: కులకచర్ల గ్రామంలో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామా  నికి చెందిన గుండుమల్ల చంద్రలింగం బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున దుకాణంలో  ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచామివ్వగా ఫైరింజన్‌ వచ్చేలోపు బట్టల దుకాణం పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.కోటి వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు చంద్రలింగం తెలిపారు. ఘటనా స్థలాన్ని అగ్నిమాపకశాఖ డీఎఫ్‌వో సుధాకర్‌, ఎస్‌ఐ గిరి తదితరులు పరిశీలించారు. 

Updated Date - 2022-07-03T05:20:59+05:30 IST