Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 00:21:18 IST

మైక్‌ టైసన్‌తో ఫైట్‌ అంటే... అమ్మ భయపడింది

twitter-iconwatsapp-iconfb-icon

‘‘సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో.. పూరి సార్‌ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొన్నా. ‘పూరి అసిస్టెంట్‌ డైరెక్టర్లకు బాగా డబ్బులిస్తారు..’ అని నాన్న చెప్పారు. ఆయన కోసం కలవడానికి వెళ్లా. కానీ.. కుదర్లేదు. కానీ ఇంటికొచ్చి.. ‘పూరి సార్‌ని కలిశా..’ అని నాన్నతో అబద్ధం చెప్పా. ఇప్పుడు పూరితోనే పాన్‌ ఇండియా స్థాయి సినిమా చేయడం చాలా ఆనందాన్ని కలిగించింద’’న్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లైగర్‌’. ఈనెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ కథానాయిక అనన్య పాండేతో కలిసి హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ విశేషాలు ఇవీ...


‘‘లైగర్‌ పక్కా కమర్షియల్‌ సినిమా. ఈ కథ వినిపించేటప్పుడు పాన్‌ ఇండియా ఆలోచన లేదు. ఆ తరవాత పాన్‌ ఇండియా ప్రాజెక్టుగా మారింది. ప్రతి సన్నివేశాన్నీ తెలుగు, హిందీ భాషలు రెండింట్లోనూ షూట్‌ చేశాం. ముందు హిందీ వెర్షన్‌ పూర్తవ్వడంతో పాటల్ని ముందుగా హిందీలో తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తీశాం. హిందీ వాళ్లకూ నచ్చే కంటెంట్‌ ఈ కథలో ఉంది. అందుకే బాలీవుడ్‌కి వెళ్తున్నాం. ‘లైగర్‌’తో ఇండియాని షేక్‌ చేస్తామన్న నమ్మకం నాకు బలంగా ఉంది’’


‘‘అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలోలానే ఇందులోనూ మదర్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. కానీ.. ఈ రెండు కథలూ ఒకటి కావు. నిజానికి అమ్మానాన్న తమిళ అమ్మాయి ఇప్పుడు తీసినా జనం చూస్తారు. అంత మంచి కథ అది. ‘లైగర్‌’ పాత్ర కోసం సన్నద్ధమవ్వడం కోసం చాలా కష్టపడ్డా. నూటికి నూరుపాళ్లూ శ్రమించా. రెండు నెలల్లో బాడీ ఫిట్‌ అయిపోతుందని అనుకొన్నా. ఆ రెండు నెలలూ తీవ్రంగా కష్టపడినా.. ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ పూరి సార్‌ని టైమ్‌ అడిగా. పాండమిక్‌ వల్ల మధ్యలో గ్యాప్‌ వచ్చింది. ఆ టైమ్‌లో.. బాడీ పెంచాను’’.


‘‘మైక్‌ టైసన్‌తో ఫైటింగ్‌ సీన్‌ ఒకటి ఉంది. దాంతో మా అమ్మ చాలా భయపడింది. తన దృష్టిలో మేం నిజంగానే కొట్టుకొంటాం అనుకొంది. మైక్‌ టైసన్‌ని తొలిసారి కలుసుకొన్నప్పుడు నాక్కూడా కొంచెం భయంగానే అనిపించింది. ఆయన హైటూ, పర్సనాలిటీ చూసి కంగారొచ్చింది. తను చాలా మంచి వ్యక్తి. ఈ కథ రాసుకొన్నప్పుడే టైసన్‌ పాత్ర ఉంది. అయితే ఆ పాత్రని రిఫరెన్స్‌ కోసం చెబుతున్నారేమో.. అనుకొన్నా. కానీ పూరి సర్‌ నిజంగానే ఆయన్ని తీసుకొచ్చారు. టైసన్‌ రాకతో ఈ సినిమా స్థాయి పెరిగింది’’.


‘‘పాటలకు డాన్స్‌ చేయాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నన్ను నేను ఓ డాన్సర్‌గా చూసుకోలేను. ఏదో ఆ టైమ్‌కి నా పని అయిపోతే చాలనుకొంటాను. అనన్య మంచి డాన్సర్‌. తను బాగా చేసినా నా మూమెంట్‌ కుదరకపోవడంతో నాకు నేనే ‘కట్‌..’ చెప్పుకొనేవాడిని. తను నా కోసం చాలా ఓపిక పట్టింది. ఈ సినిమా కోసం నగ్నంగా ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. అది బాగా వైరల్‌ అయ్యింది. నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తా. ఆ తరవాతి ఫలితాలేంటి? అనేది అస్సలు ఆలోచించను’’.


థియేటర్లు పగిలిపోతాయి: అనన్య పాండే

‘‘తెలుగులో లైగర్‌తో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. దేశ వ్యాప్తంగా ‘లైగర్‌’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా మా చిత్రబృందానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఒకటి మాత్రం కచ్చితంగా చెబుతా.. ‘లైగర్‌’తో థియేటర్లు పగిలిపోతాయి. ఇది గ్యారెంటీ. విజయ్‌ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. తన సహకారం మర్చిపోలేనిది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement