అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు: యోగి

ABN , First Publish Date - 2021-12-06T21:49:08+05:30 IST

భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌమ్యం లాంటివి తన ఆదర్శాలని బాబాసాహేబ్ భీంరావ్ అంబేద్కర్ పేర్కొన్నారు. దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు రాజ్యాంగం ఏకం చేస్తుంది. రాజ్యాంగ సూత్రాల్ని బీజేపీ ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో..

అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు: యోగి

లఖ్‌నవూ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని, అయితే దళితుల సంక్షేమం గురించి వారు ఏమాత్రం ఆలోచించరని బహుజన్ సమాజ్ పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సోమవారం రాష్ట్రంలోని అజాంగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు.


అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన అనంతరం యోగి మాట్లాడుతూ ‘‘భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌమ్యం లాంటివి తన ఆదర్శాలని బాబాసాహేబ్ భీంరావ్ అంబేద్కర్ పేర్కొన్నారు. దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు రాజ్యాంగం ఏకం చేస్తుంది. రాజ్యాంగ సూత్రాల్ని బీజేపీ ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ అనే నినాదంతో దేశం అభివృద్ధివైపు పయనిస్తోంది. కానీ కొంత మంది బాబాసాహేబ్ అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి వారికి దళితుల సంక్షేమం ఎంత మాత్రమూ పట్టదు’’ అని అన్నారు.

Updated Date - 2021-12-06T21:49:08+05:30 IST