ఆకట్టుకుంటున్న ఏటికొప్పాక కళా ఖండాలు

ABN , First Publish Date - 2022-08-07T09:54:03+05:30 IST

ఆకట్టుకుంటున్న ఏటికొప్పాక కళా ఖండాలు

ఆకట్టుకుంటున్న ఏటికొప్పాక కళా ఖండాలు

ఎలమంచిలి, ఆగస్టు 6: ఆధునిక పోకడలకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విభిన్న కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు.  అంకుడు కర్రను ఉపయోగించి సహజసిద్ధ రంగుల మేళవింపుతో ప్రజల అభిరుచులకు తగినట్టుగా నూతన కళాఖండాలను తయారుచేస్తున్నారు. తాజాగా బెడ్‌ ల్యాంప్‌ స్టాండ్‌తో పాటు, రోకళ్లు, తిరగళ్లు బొమ్మలను ఆకట్టుకునేలా రూపొందించారు. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు, పురోహితుడితో పాటు మేళగాళ్లు, సమస్త సారె సామగ్రితో తీర్చిదిద్దిన కళాఖండం ఆకట్టుకుంటోంది.

Updated Date - 2022-08-07T09:54:03+05:30 IST