అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకరాఖీ పండుగ

ABN , First Publish Date - 2022-08-12T07:33:14+05:30 IST

అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల అనుబంధ, అప్యాయతలకు రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకరాఖీ పండుగ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి రాఖీ కడుతున్న తోబుట్టువు

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఆగస్టు 11 : అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల అనుబంధ, అప్యాయతలకు రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఆయన సోదరీమణులు గురువారం రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తోబుట్టువుల మధ్య రాఖీ పండగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాఖీ పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి రాఖీ కట్టిన మహిళలు

భైంసా, ఆగస్టు 11 :భైంసాలో గురువారం రాఖీ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి మహిళలు రాఖీ కట్టారు. పలు ప్రాంతాలకు చెందిన మహిళ లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలోనున్న  ఎమ్మెల్యేను కలిసి తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎంసీ చైర్మెన్‌ పి.కృష్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము తదితరులున్నారు.

Updated Date - 2022-08-12T07:33:14+05:30 IST