Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 07 Jul 2022 00:56:26 IST

ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరి

twitter-iconwatsapp-iconfb-icon

అఖిల్‌ రాజ్‌, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున ్న నూతన చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య అల్లంకొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ జి. ప్రతా్‌పరెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో అభిరామ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నటుడు కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘సూర్య చెప్పిన కథ నచ్చింది. మంచి ప్రేమక థా చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంద’న్నారు. ఇదొక ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరి, దర్శకుడు కథను మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని జి. ప్రతా్‌పరెడ్డి అన్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం అని చిత్ర దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వీఆర్‌కే నాయుడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement