Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 18 Aug 2022 16:54:19 IST

Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..

twitter-iconwatsapp-iconfb-icon
Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..

పిల్లలు తప్పు చేస్తే సరిదిద్ది.. సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవి చేసి, పిల్లలపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ఇంకొందరైతే.. తమ మాట వినలేదనే కోపంతో చివరకు సొంత పిల్లలను చంపడానికి కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిని చంపి, మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశాడు. అంతటితో ఆగకుండా.. శవం ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా తలను కూడా వేరు చేశాడు. ఈ విషాద ఘటనకు (tragic incident) సంబంధించిన వివారాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మీరట్ (Meerut) పరిధి లిసాడి గేట్ ప్రాంతంలోని కూడలిలో ఆగస్టు 12న తల లేని యువతి మృతదేహం పడి ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. తల లేకపోవడంతో మృతురాలిని గుర్తుపట్టడం స్థానికులకు కష్టంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని (dead body) స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతురాలి తల కోసం గాలిస్తున్న క్రమంలో.. చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి.. తన కూతురికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకోవడం యువతికి ఇష్టం లేదు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మొత్తం యువతికే మద్దతు ఇచ్చారు. ఇది తండ్రికి అసలు నచ్చలేదు.

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..

దీంతో ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రోజు తాను తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకోవాలంటూ కూతురిపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు యువతి ససేమిరా అనడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఓ రోజు కూతురిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతి కిరాతకంగా గొంతు కోసి, తలను వేరు చేశాడు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేలా.. మొండాన్ని ఓ చోట, తలను కాలువలో పడేశాడు. చివరకు మృతురాలి తండ్రి, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల కోసం కాలువలో గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి.. Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే.. videosnake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..videoఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.