బంజారాహిల్స్‌లో తాగుబోతుల వీరంగం

ABN , First Publish Date - 2021-12-11T23:11:01+05:30 IST

నగరంలోని బంజారాహిల్స్‌లో తాగుబోతులు వీరంగం

బంజారాహిల్స్‌లో తాగుబోతుల వీరంగం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి బంజారాహిల్స్ వరకు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో ఆటో నడిపి పలువురిని ఇద్దరు మందుబాబులు ఢీకొట్టారు. వాహనదారుల సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దాడిచేసి పారిపోతున్న మందుబాబులను స్థానికులు పట్టుకున్నారు. అయితే స్థానికులపై మందుబాబులు తిరగబడ్డారు. దీంతో వారికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  




Updated Date - 2021-12-11T23:11:01+05:30 IST