Abn logo
Jun 7 2020 @ 05:36AM

ఉట్నూర్‌లో కలవరపెడుతున్న కరోనా

ఉట్నూర్‌, జూన్‌ 6: కోవిడ్‌-19 ముప్పును గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి నుంచి రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించి భారీ ఎత్తున  కరోనా వైరస్‌ కట్టడి కోసం చేపట్టిన చర్యలు ప్రస్తుతం మరచిపోతుండడంతో ఏజెన్సీలోని ప్రజల ను కరోనా వైరస్‌ కలవరానికి గురి చేస్తోంది. ఏజెన్సీలోని ఉట్నూర్‌, జైనూర్‌ మండలాల్లో కరోనా పాజిటీవ్‌లు వచ్చినప్పటికీ వారి కాంట్రాక్టు కేసులపై వైద్యాధికారులు చిత్తశుద్ధి చూపడం లేదు.


ఉట్నూర్‌ మండలంలో శాంతినగర్‌, నవోదయనగర్‌, బోయవాడ ప్రాంతాలలో తొమ్మిది కేసులు వెలుగుచూడగా.. వారి కుటుంబీకులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించి కరోనా పరీక్షలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  ప్రజలు స్వీయరక్షణలో ఉండాలని ప్రభుత్వం ప్రకటించడం సరైంది కాదనింటున్నా రు. ఉట్నూర్‌లో వెలుగుచూసిన కేసులకు సంబందించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఐటీడీఏ కార్యాలయంతో పాటు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉండడం తో ఆయా కార్యాలయాల్లోని ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఐటీడీఏలో ఉద్యోగులకు థర్మల్‌స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.


ఎస్‌బిఐ అధికారులు కోవిడ్‌-19 కారణంగా బ్యాంక్‌ను మూసివేయడం జరిగిందని నోటీసు బోర్డు పెట్టి బ్యాంకు లావాదేవిలు రద్దు చేశారు. ఇది ఇలా ఉండగా ఉట్నూర్‌లోని శాంతినగర్‌, బోయవాడ, నవోదయనగర్‌లలో తొమ్మిది కేసు లు రావడంతో దంతన్‌పల్లి డాక్టర్‌ కోవ అనురాధ ఆద్వర్యంలో 14 వైద్య బృందాలు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరికి కూడ జ్వరాలు రావడం లేదని  పేర్కొంటున్నారు. 

Advertisement
Advertisement