కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం మధిర గ్రామంలో దారుణం జరిగింది. తన పిల్లలను చంపడానికి కన్నతల్లే ప్రయత్నం చేసింది. కుటుంబ కలహాలతో శాంతి (25) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగులు మందు తాగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శాంతిని ఆరునెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు. పిల్లలు భారత్ (4) ప్రియాంక(2) చికిత్స పొందుతున్నారు. తల్లి శాంతి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.