కరోనాకు ‘కవచ్‌’

ABN , First Publish Date - 2020-03-26T06:23:07+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్య

కరోనాకు ‘కవచ్‌’

జాగ్రత్తలు గుర్తు చేసే డివైజ్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్య నిపుణులు నెత్తీ నోరు మొత్తుకొని హెచ్చరిస్తున్నా ఎక్కువ మంది పాటించడం లేదు.  ఇలాంటి ధోరణులను నివారించడానికి పంజాబ్‌లోని ‘లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ’కి చెందిన విద్యార్థులు ఒక సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. దీని పేరు ‘కవచ్‌’. ఈ పరికరం పెండెంట్‌లో అమర్చబడి ఉంటుంది. కవచ్‌లో హ్యాండ్‌ వాష్‌ రిమైండర్‌తో సహా పలు ఫీచర్లు ఉంటాయి. ఈ రిమైండర్‌   ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బీప్స్‌  శబ్ధం చేస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక వేళ  శరీర ఉష్ణాగ్రత నిర్దేశిత  స్థాయిని మించి పెరిగినట్లయితే ఈ పరికరంలోని సెన్సర్‌ గ్రహించి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తాయి. అంతేకాదు ఈ పెండెంట్‌ ధరించిన వ్యక్తికి ఒక మీటరు పరిఽధిలోకి ఎవరు వచ్చినా  బీప్‌ శబ్ధంతో  హెచ్చరిస్తుంది. 


ఇది చవకగా లభిస్తుంది. ధరించడానికి  కూడా సులువుగా ఉంటుంది.ఈ కవచ్‌లో ఎల్‌ఇడి, వైబ్రేటర్‌, కంట్రోలర్‌, బ్యాటరీ, హ్యూమన్‌ బాడీ టెంపరేచర్‌ సెన్సర్‌, అలా్ట్రసోనిక్‌ సెన్సర్‌, స్టోరేజి కార్డు వంటి సూక్ష్మ పరికరాలుంటాయి.


వాణిజ్యపరంగా ఈ పరికరం ఉత్పత్తిని ప్రారంభించినట్లయితే మార్కెట్లో దీని ధర కేవలం రూ.400 వరకు ఉండే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-03-26T06:23:07+05:30 IST