మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న 16 ఏళ్ల కుర్రాడు మృతి.. అతడి గదిలో దొరికిన వాటితో బయటపడ్డ దారుణ నిజాలివి..!

ABN , First Publish Date - 2021-11-12T23:46:36+05:30 IST

అతడు తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. అయితే..ఆ రాత్రి మాత్రం కుర్రాడు అన్నం తినలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపడుకున్నాడు. ఇంట్లో వాళ్లు కూడా అతడిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మరుసటి రోజున..

మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న 16 ఏళ్ల కుర్రాడు మృతి.. అతడి గదిలో దొరికిన వాటితో బయటపడ్డ దారుణ నిజాలివి..!

ఇంటర్నెట్ డెస్క్: అతడు తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. అయితే..ఆ రాత్రి మాత్రం కుర్రాడు అన్నం తినలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపడుకున్నాడు. ఇంట్లో వాళ్లు కూడా అతడిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మరుసటి రోజున అతడిని నిద్రలేపేందుకు మేనత్త వెళ్లింది. కానీ..కుర్రాడి గదితలుపులు మాత్రం మూసే ఉన్నాయి. ఎంత కొట్టినా అతడు తలుపు తీయలేదు. ఏం జరిగిందో అనుకుంటూ ఆమె వెళ్లి తలుపు తీసింది. అంతే..అక్కడి దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా పెద్ద కేక పెట్టింది. బోరున ఏడుస్తూ భర్తను, ఇతర కుటుంబసభ్యులను పిలిచింది. గత రాత్రే అతడు ఉరిపోసుకున్నాడు. కరెంట్ తీగతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గురువారం రాత్రి బీహార్‌లోని ముజఫ్పర్‌పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన దారుణం ఇది. పోలీసుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు ఆదిత్య కుమార్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కానీ.. నాలుగేళ్ల క్రితం..అంటే చాలా చిన్న వయసులో ఉండగానే అతడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. పూర్తిగా బానిసైపోయాడు. స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అతడిని ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఏకంగా బెంగళూరుకు అతడిని తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించినా ఫలితం లేకపోయింది. 


ఈ క్రమంలో వారు ఆదిత్యను మేనమామ ఇంట్లో ఉంచారు. చుట్టూ పరిసరాలు మారితే అన్నా కుర్రాడిలో మార్పు వస్తుందేమోననే చిన్న ఆశ. అయితే..అతడి పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది.  డ్రగ్స్‌కు దూరమడంతో అతడు తన మనసుపై ఆధీనం కోల్పోయాడు. విచలితుడైపోయాడు. ఈ క్రమంలో తిండి తినడం కూడా మానేశాడు.  డ్రగ్స్ తీసుకోలేడు అలా అని వాటికి దూరంగానూ ఉండలేడు. ఈ సంఘర్షణను తట్టుకోలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత చిన్న వయసులో ఇలా డ్రగ్స్‌కు బలయిన అతడి గురించి విన్న స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక కుటుంబసభ్యుల మానసిక క్షోభ మాత్రం వర్ణణాతీతం.

Updated Date - 2021-11-12T23:46:36+05:30 IST