పార్లమెంట్‌లో రుణ విమోచన చట్టం చేయాలి

ABN , First Publish Date - 2022-07-03T05:53:33+05:30 IST

పార్లమెంటులో రుణ విమోచన చట్టం చేయాలని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రైతుసంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభ లు రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 50 ఏళ్లు దాటిన రైతులకు నెల కు రూ.10వేల పింఛన్‌ ఇవ్వాలన్నారు.

పార్లమెంట్‌లో రుణ విమోచన చట్టం చేయాలి
మహాసభలో మాట్లాడుతున్న వెంకటయ్య

రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య


హుజూర్‌నగర్‌, జూలై 2: పార్లమెంటులో రుణ విమోచన చట్టం చేయాలని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రైతుసంఘం రాష్ట్ర  ద్వితీయ మహాసభ లు రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 50 ఏళ్లు దాటిన రైతులకు నెల కు రూ.10వేల పింఛన్‌ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ.లక్షల ఫించన్‌ ఇస్తున్నారని, రైతులకు ఎందుకు ఫించన్‌ ఇవ్వరన్నారు. రైతాంగానికి ఉచిత వైద్యం అందించాలన్నారు. వ్యవసాయ రంగం లో సమూలంగా మార్పులు రావాలన్నారు. పాలకవర్గా లు రైతు సమస్యలపై దేశంలోని రైతు సంఘాలతో చర్చించి పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండోస్థానంలో, తెలంగాణ మూడోస్థానంలో ఉందని అన్నారు. గంటకు ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నారు. దేశంలో రైతు సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. ప్రతినిధు ల సభకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సమ్మెర విశ్వేర్వరావు, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.విద్యాసాగర్‌, దొడ్డా నారాయణరావు, కొప్పోజు సూర్యనారాయణ, గన్నా చంద్రశేఖర్‌, కంబాల శ్రీనివాస్‌, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, పాలకూరి బాబు, బ్రహ్మం, రాజయ్య, యాదగిరిరావు, వెంకటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:53:33+05:30 IST