దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు

ABN , First Publish Date - 2022-07-08T04:18:47+05:30 IST

దళితుల జీవితాల్లో దళితబంధు పథకం వెలుగులు నింపుతుందని, పథకాన్ని సద్వినియో గం చేసుకుని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి మండలాలకు చెం దిన దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను అంద జేశారు. విప్‌ మాట్లాడుతూ దేశంలో అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు
దళితబంధు యూనిట్లను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

చెన్నూరు, జూలై 7:  దళితుల జీవితాల్లో దళితబంధు పథకం వెలుగులు నింపుతుందని, పథకాన్ని సద్వినియో గం చేసుకుని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి మండలాలకు చెం దిన దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను అంద జేశారు. విప్‌ మాట్లాడుతూ దేశంలో అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. కోటపల్లి మండలానికి నాలుగు, చెన్నూరు మండలానికి ఒకటి చొప్పున యూనిట్లను పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. పద్మనగర్‌ కాలనీలో ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మొక్కలు నాటారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనరాం లాల్‌గిల్డా, కమిషనర్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, కౌన్సిలర్లు శరణ్య, వైస్‌ చైర్మన్‌ నవాజుద్దీన్‌, పాల్గొన్నారు. 

మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం వద్దు

మందమర్రి: మిషన్‌ భగీరథ పనులలో అలసత్వం వద్దని, గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌,  ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అధికారులను ఆదేశించారు. క్యాతన్‌పల్లిలోని ఆయన నివాసంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనులలో ఇప్ప టికే ఆలస్యం జరిగిందని, ఇంకా అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మిషన్‌ భగీరథ ఈఈ(ఇంట్రా) అంజన్‌ రావు,  డీఈ  వెంకటేష్‌, ఈఈ (గ్రిడ్‌) మధుసు దన్‌, డీఈ  కృష్ణ  పాల్గొన్నారు.

తాత్కాలిక రోడ్డును పరిశీలన

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధి రైల్వే వంతెన సమీ పంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడు,్డ కల్వర్టు పను లను ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పరిశీలించారు.  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దని, మరో సారి ఇలాంటి పరిస్థి తులు రావద్దని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని సూచించారు.  

Updated Date - 2022-07-08T04:18:47+05:30 IST