Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 04 Jul 2022 11:08:53 IST

DJ Tillu 2 : కీలక మార్పు ఇదేనట !

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహా శెట్టి (Neha Shetty) జోడీగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ (DJ Tillu). కొత్త దర్శకుడు విమల్ కృష్ణ (Vimal Krishna) మలిచిన ఈసినిమాకి కథ, డైలాగ్స్ రాసింది సిద్దూ జొన్నల గడ్డనే. ఈ సినిమాను యూత్ విశేషంగా ఆదరించారు. ముఖ్యంగా టిల్లు పాత్రధారి సిద్ధూ జొన్నలగడ్డ డైలాగ్స్, అతడి యాక్టింగ్ జనంలోకి బాగా వెళ్ళిపోయాయి. పాటలు కూడా ఈ సినిమా ఘనవిజయానికి ఎంతో దోహదం చేశాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించి.. చిన్న సినిమా సత్తా ఏపాటిదో చాటిచెప్పింది. 

డీజే టిల్లుగా..  హైదరాబాద్ లోకల్ స్లాంగ్‌తో చెలరేగిన సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయోత్సాహంతో దీనికి సీక్వెల్ ను తీయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. దీనికి కూడా అతడే కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు. మరో విశేషమేంటంటే.. సీక్వెల్ కోసం అతడు తొలిసారిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. అలాగే.. ఈ సినిమా విషయంలో ఒక కీలక మార్పు కూడా చోటుచేసుకోనుంది. అదేంటంటే.. రెండో భాగంలో హీరోయిన్ మారుతోంది. మొదటి భాగంలో అద్భుతంగా నటించిన నేహాశెట్టి.. ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమాను కూడా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) వారే నిర్మించబోతున్నారు. 

ప్రస్తుతం ఓ క్రేజీ గ్లామర్ హీరోయిన్ కోసం టీమ్ అన్వేషిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన కొన్ని పాత్రలు రెండో భాగంలోనూ కొనసాగుతాయి. ఇంకొన్ని పాత్రలు వచ్చి చేరతాయట. వాటిలో హీరోయిన్ పాత్ర ప్రధానమైనది. రాధిక అనే అమ్మాయిలో ప్రేమలో పడిన టిల్లు.. ఆమె చేసిన హత్యలో తానూ అనుకోకుండా ఇరుక్కుంటాడు. చివరికి ఈ హత్యకేసు నుంచి అతడు ఎలా బైటికొస్తాడు? అన్నదే మిగతా కథాంశం. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలో సైతం దుమ్మురేపేసిన ఈ సినిమా సీక్వెల్ కోసం సిద్ధు జొన్నలగడ్డ ఇంకెలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement