ఓ వైపు రైతుల నిరసన.. మరోవైపు కేంద్ర మంత్రి కాన్వాయ్.. చివరకు ఘోరం జరిగింది..

ABN , First Publish Date - 2021-10-04T01:12:58+05:30 IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా నిరసన తెలియజేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కాన్వాయ్ అటువైపు వచ్చింది. తర్వాత జరిగన ఘటన.. ఇద్దరు రైతుల మరణానికి దారి తీసింది. పోలీసు బలగాలను

ఓ వైపు రైతుల నిరసన.. మరోవైపు కేంద్ర మంత్రి కాన్వాయ్.. చివరకు ఘోరం జరిగింది..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా నిరసన తెలియజేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కాన్వాయ్ అటువైపు వచ్చింది. తర్వాత జరిగన ఘటన.. ఇద్దరు రైతుల మరణానికి దారి తీసింది. పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితికి తలెత్తిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతులు ఆదివారం నిరసన తెలియజేస్తున్నారు. అదే సమయంలో టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల ఘర్షణ చెలరేగింది.


ఈ క్రమంలో కేంద్ర మంత్రుల కాన్వాయ్.. రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించారని, మరో 8 మంది గాయపడ్డారు. దీంతో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు చెందిన మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనను సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్.. తీవ్రంగా ఖండించారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రధానంగా కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు వినిపిస్తోంది.

Updated Date - 2021-10-04T01:12:58+05:30 IST