Oct 20 2021 @ 18:31PM

KBC: తాప్సీ సీక్రెట్స్ అడిగిన అభిమాని.... బిత్తరపోయిన బిగ్ బి

కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ) సీజన్-13కు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు కంటెస్టెంట్‌గా వచ్చిన వ్యక్తి బిగ్‌బిని, తాప్సీ గురించి వరుసగా అనేక ప్రశ్నలడగడంతో ఆయన బిత్తర‌పాయారు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో విడుదలైన ఆ ప్రొమో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 


మధ్యప్రదేశ్‌లోని చత్తార్‌పూర్‌కు చెందిన సాహిల్ అహిర్‌వాల్ అనే వ్యక్తి హాట్ సీట్లో కూర్చోని యాంగ్రీ యంగ్‌మెన్‌ని ఈ ప్రశ్నలడిగారు. సోనీ టెలివిజన్ విడుదల చేసిన ఈ ప్రొమోలో.. సెక్యూరిటీ గార్డ్ కొడుకయిన సాహిల్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు అని చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. మీ ఫేవరేట్ హీరో ఎవరని సాహిల్‌ను అడగగా సల్మాన్ ఖాన్ అని ఆయన సమాధానమిచ్చారు.  బిగ్‌బి తల ఊపగా మరల ఆయన అదే సమాధానం చెప్పారు. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరని సాహిల్‌ను అడగగా తాప్సీ అని తెలిపారు. ఆమె అంటే లవ్, క్రష్, సర్వస్వం అని పేర్కొన్నారు.


అతడిచ్చిన సమాధానంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వడం మొదలెట్టారు. అనంతరం అతడు అమితాబ్‌ను తాప్సీ గురించి అనేక ప్రశ్నలడిగి బిత్తరపోయేలా చేశాడు. ‘‘ సార్ మీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో పనిచేశారు. ఆమె అంత ఫిట్‌గా ఏలా ఉంటుంది. ఏం తింటుంది. తాప్సీ ప్రతి సీక్రెట్ మీకు తెలిసే ఉంటుంది ’’ అని తెలిపారు. దీంతో ప్రేక్షకులు  ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు.


‘‘సార్ ఒక చిన్న ప్రశ్న. పింక్ సినిమాలో ఆమెని కాపాడారు. బాద్లా సినిమాలో ఆమెని లక్ష్యంగా చేసుకున్నారు. సార్ ఇది ఏం కెమిస్ట్రీ. ఆమెను చంపాలనుకుంటే పింక్ సినిమాలో ఎందుకు కాపాడారు ’’ అని ప్రశ్నించాడు. సాహిల్ వైపు ప్రశ్నార్థకంగా అమితాబ్ చూస్తుండగా వీడియో ముగుస్తుంది. అతడు తాప్సీకి సంబంధించి అనేక ప్రశ్నలు అడగడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.


Bollywoodమరిన్ని...