రాజ్యాంగ బద్ధంగా కల్పించిన పదవి

ABN , First Publish Date - 2021-10-19T05:59:29+05:30 IST

రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా కల్పించిన పదవి స్పీకర్‌ పదవి అ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సు వాడ పట్టణంలో రూ.కోటీ 10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హనుమాన్‌ వ్యాయామ శాల నూతన సముదాయాలను, ఫంక్షన్‌ హాల్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.

రాజ్యాంగ బద్ధంగా కల్పించిన పదవి
బాన్సువాడ మండలం కొల్లూర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం

నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యం.. అభివృద్ధేనా లక్ష్యం 

అర్హులైన వారందరికీ పక్కాగా డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించి తీరుతా

బాన్సువాడ టూ బైంసా జాతీయ రహదారికి రూ.550 కోట్లు మంజూరు 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి 

బాన్సువాడ, అక్టోబరు 18: రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా కల్పించిన పదవి స్పీకర్‌ పదవి అ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సు వాడ పట్టణంలో రూ.కోటీ 10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హనుమాన్‌ వ్యాయామ శాల నూతన సముదాయాలను, ఫంక్షన్‌ హాల్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ మండలం కొల్లూర్‌, నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ముదిరాజ్‌ సంఘ భవనం, హైలెవల్‌ బ్రిడ్జి ప్రారంభం, నూతన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభం, నూతనంగా నిర్మిం చబోయే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ, మసీద్‌ ప్రహరీ ప్రా రంభోత్సవం, నాగారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా  పట్టణంలోని బాలికల హై స్కూల్‌ పాఠశాలను సందర్శించి, నూతనంగా మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.10లక్షలు, మూడు అదనపు గదుల నిర్మాణానికి ఒక్కొక్క దానికి రూ.9 లక్షల చొప్పున మంజూరు చేశారు. అదేవిధంగా ఎంపీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని, త్వరలోనే నూతన భవన నిర్మాణాన్ని మంజూరు చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ హోదాలో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయిస్తున్నారు అన్నారు. నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యమని, అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నేను పట్టించుకోనని, నాకు ప్రజల సంక్షే మం, నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళతామని అన్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మెదక్‌ మీదుగా బాన్సువాడ పట్టణం నుంచి బైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.550 కోట్లు మంజూరయ్యాయని, త్వర లోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ పక్కాగా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించి వారికి అందజేస్తామన్నారు. అలాగే, బాన్సువాడ కు త్వరలోనే రైల్వే ట్రాక్‌ ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి బాన్సువాడ మీదుగా రైల్వే ట్రాక్‌ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో ఆర్డీవో రాజాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని వినతి 

బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలోని మోడల్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌తో పాటు ఆరు టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  దీంతో విద్యార్థులకు చదువు చెప్పకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని పాఠశాల ఎస్‌ఎంసీ సభ్యులు స్పీకర్‌కు తెలిపారు. పాఠశాల ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో తరగతులు జరుగ డం లేదని వారు విన్నవించారు. స్పందించిన స్పీకర్‌ సంబంధిత అధికారులు టీచర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సభ్యులు తెలిపారు.

మొగులయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ

బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌ గ్రామానికి చెందిన మొగులయ్య(34) అనే యువకుడు ఇటీవల గుండెపోటుతో మరణించాడు. సోమవారం కొల్లూర్‌ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మార్గమధ్యలో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  

Updated Date - 2021-10-19T05:59:29+05:30 IST