రాజీమార్గం వైపేమొగ్గు చూపాలి

ABN , First Publish Date - 2022-08-14T06:25:45+05:30 IST

కక్షిదారులు రాజీమార్గం వైపే మొగ్గు చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పిలుపునిచ్చారు. చిత్తూరు కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రాజీమార్గం వైపేమొగ్గు చూపాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు

కక్షిదారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సూచన


చిత్తూరు, లీగల్‌, ఆగష్టు 13: కక్షిదారులు రాజీమార్గం వైపే మొగ్గు చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పిలుపునిచ్చారు. చిత్తూరు కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు పట్టుదలకు పోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటే దేశ భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఏవైనా సమస్యలు వచ్చినా, చిన్న చిన్న గొడవలు పడినా నేరుగా ఉచితంగా న్యాయ సేవలు పొందేందుకు డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. అనంతరం చట్టాల గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పరిష్కారమైన కొన్ని కేసుల ధ్రువీకరణ పత్రాలను కక్షిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ కరుణకుమార్‌, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


లోక్‌ అదాలత్‌ ద్వారా 10,793 కేసుల పరిష్కారం


 చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా 10,793 కేసులు పరిష్కార మయ్యాయి. ఇందులో తిరుపతి కోర్టులో 1,622, చిత్తూరు జిల్లా పరిధిలోని వాల్మీకిపురం కోర్టులో 139, తంబళ్లపల్లె 190, శ్రీకాళహస్తి 429, సత్యవేడు 233, పుత్తూరు 582, పుంగనూరు 770, పీలేరు 383, నగరి 368, మదనపల్లె 1470, కుప్పం 704, చిత్తూరు 2,443, పలమనేరు 1,267, పాకాల కోర్టులో 193 కేసులున్నాయి.


Updated Date - 2022-08-14T06:25:45+05:30 IST