ధరణి సమస్యలకు త్వరలోనే పూర్తి పరిష్కారం

ABN , First Publish Date - 2021-02-25T04:57:02+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించి నూతన ధరణి పుస్తకాలను అందించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించింది.

ధరణి సమస్యలకు త్వరలోనే పూర్తి పరిష్కారం

ఇందల్‌వాయి, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించి నూతన ధరణి పుస్తకాలను అందించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించింది. ఇంకా కొన్ని సమస్యలను పూర్తి పరిష్కారం కాకపోవడంతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుందర్‌ అప్నారి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ జిల్లాలోని ఇందల్‌వాయి, బోధన్‌, మోర్తాడ్‌ మండలాలను ఎంచుకుని భూ సమస్యలకు పూర్తి పరిష్కారం చేసేందుకు ప్రత్యేక బృందం రికార్డులను పరిశీలిస్తుంది. బుధవారం ఇందల్‌వాయి తహసీల్‌ కార్యాలయంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ప్రత్యక్ష అధికారి సుధీర్ఘంగా చర్యలు జరిపారు. రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నాలాకు సంబంధించి అసైండ్‌ భూముల రికార్డులు పెండింగ్‌ మ్యూటేషన్‌ సంబంధించిన వాటిపై ప్రభుత్వంకు నివేదిక సమర్పిస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వందశాతం పూర్తిచేసి రైతులకు మేలైన భూరికార్డులను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇందల్‌వాయి నుంచి బోధన్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో వీరితో పాటు ఇందల్‌వాయి తహసీల్దార్‌ రమేష్‌, డిప్యూటి తహసీల్దార్‌ విజయలక్ష్మీ, ఆర్‌ఐ బషరత్‌అలీ, సీనియర్‌ అసిస్టెంట్‌ అశోక్‌, సర్వేయర్‌ నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:57:02+05:30 IST