TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇంజినీర్ల‌తో కమిటీ వేయాలి: ఎమ్మెల్యే ఈటల

ABN , First Publish Date - 2022-08-19T22:46:03+05:30 IST

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నిర్మాణంలో నాణ్యత లోపించిందని, అవినీతి చోటుచేసుకుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ (Shekawath) ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో

TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇంజినీర్ల‌తో కమిటీ వేయాలి: ఎమ్మెల్యే ఈటల

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నిర్మాణంలో నాణ్యత లోపించిందని, అవినీతి చోటుచేసుకుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ (Shekawath) ఇటీవల  వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నాణ్యతపై ఇంజినీర్ల‌తో కమిటీ వేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Eetala Rajendar) డిమాండ్ చేశారు. అవినీతి జరగకుంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్ళకుండా ఇతర పార్టీల ప్రజాప్రతినిథులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మునుగోడులో జరిగే బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించటానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే బీజేపీ బహిరంగ సభ కంటే ముందురోజే సభ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చాలామంది ప్రజా ప్రతినిథులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..అయితే పార్టీ మారకుండా ఉండేందుకు సొంత పార్టీ నాయకులకు టీఆర్ఎస్ వెల కడుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా.. ఆశ చూపినా స్థానిక నేతలు  కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. టీఆర్ఎస్ (TRS) వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేసిందని ఆరోపించారు.  

Updated Date - 2022-08-19T22:46:03+05:30 IST