‘కాళేశ్వరం’ నాణ్యతపై కమిటీ వేయాలి: ఈటల

ABN , First Publish Date - 2022-08-20T10:11:44+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై తక్షణం నిపుణుల కమిటీ వేయాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

‘కాళేశ్వరం’ నాణ్యతపై కమిటీ వేయాలి: ఈటల

టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పోలీసుల సహకారం

హైదరాబాద్‌/(రంగారెడ్డిజిల్లా ప్రతినిధి), ఆగస్టు 19: కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై తక్షణం నిపుణుల కమిటీ వేయాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.అవినీతి జరగకుం టే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఉప ఎన్నికలు రాకపోతే.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని మునుగోడు ప్ర జలు నిర్ణయించుకున్నారన్నారు. ‘‘పార్టీ మారకుండా.. మునుగోడులో సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు వెలకట్టి టీఆర్‌ఎస్‌ ఆపుకుంటోంది. పోలీసులను, డబ్బును నమ్ముకుని ఎన్నికకు వెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్‌ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్ముతున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలకు పోలీసు అధికారులు సహరిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను టీఆర్‌ఎస్‌ నాయకత్వం మునుగోడులో డంప్‌ చేసింది’’ అని ఈటల ఆరోపించారు.


కాసానిని కలిసిన ఈటల.. 

రాష్ట్రంలో చేరికలపై దృష్టిసారించిన బీజేపీ.. ఆయా పార్టీ ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోం ది. ముఖ్యంగా బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఈట ల రాజేందర్‌ ఆయా పార్టీ ముఖ్య నేతలతో  వరుస భేటీలు జరుపుతున్నారు.కొన్నేళ్లుగా ఎడమెహం పెడమోహంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ని శుక్రవారం ఈటల రా జేందర్‌ కలిశారు. బోయిగూడలోని ముదిరాజ్‌ భవన్‌లో ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  దాదాపు గంటసేపు ఇద్దరూ కలిసి ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రె్‌సలో ఉన్న కాసానిని తమ పార్టీలోకి తీసుకునేందుకు కొన్ని నెలలుగా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముదిరాజ్‌ సామాజికవర్గంలో బలమైన నేత కావడంతో పాటు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేయడంతో కాసాని రాక తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే కాసాని మాత్రం దాటవేసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2022-08-20T10:11:44+05:30 IST