‘లిప్‌స్టిక్‌ ఎఫెక్ట్‌’తో కలెక్షన్ల మోత

ABN , First Publish Date - 2020-02-20T09:11:01+05:30 IST

దేశంలో ఆర్థిక మందగమనం అనేక రంగాలను కుదేలు చేసినా బాక్సాఫీ్‌సకు మాత్రం కాసుల వర్షం కురిపించింది.

‘లిప్‌స్టిక్‌ ఎఫెక్ట్‌’తో కలెక్షన్ల మోత

ముంబై, ఫిబ్రవరి 19: దేశంలో ఆర్థిక మందగమనం అనేక రంగాలను కుదేలు చేసినా బాక్సాఫీ్‌సకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ‘లిప్‌స్టిక్‌ ఎఫెక్ట్‌’... గత ఏడాది సినిమా ప్రదర్శన వ్యాపారాన్ని గట్టెక్కించడమే కాక కలెక్షన్లను 27 శాతం పెంచిందని కేర్‌ రేటింగ్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక మందగమనం సమయంలో విలాసాల కోసం జేబు ఖాళీ చేసుకోకుండా చిన్నపాటి సరదాలకు కొంచెం ఖర్చు చేయడాన్నే ‘లిప్‌స్టిక్‌ ఎఫెక్ట్‌’గా వ్యవహరిస్తారు. ఇలా ప్రజలు సినిమాలవైపు మొగ్గు చూపడంతో రూ.5,163 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 

Updated Date - 2020-02-20T09:11:01+05:30 IST