కోట్లగరువులో కూలిన పాఠశాల భవనం

ABN , First Publish Date - 2021-09-29T06:23:34+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌ భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది.

కోట్లగరువులో కూలిన పాఠశాల భవనం
కోట్లగరువులో కూలిపోయిన పాఠశాల భవనం.


పాడేరురూరల్‌, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌ భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది. మండలంలోని వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌లో రెండు భవనాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఒక భవనం కూలిపోగా.. ఉన్న ఒక్క భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో మంగళవారం ఉదయం ఉన్న పాఠశాల భవనం కూలిపోయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, వంతాడపల్లి సర్పంచ్‌ మాదెలి రమణమ్మ, గ్రామ వలంటీర్‌, గ్రామపెద్దలు మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాల సెలవు సమయంలో ఈ సంఘటన జరగడం వల్ల భారీ ప్రమాదం తప్పిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.  

Updated Date - 2021-09-29T06:23:34+05:30 IST