Viral Video: వీడి హోలీ మామూలుగా లేదుగా.. రంగులు చల్లకుండా ఏకంగా... వామ్మో...

ABN , First Publish Date - 2022-03-20T03:01:13+05:30 IST

హోలీ సందర్భంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఇక..

Viral Video: వీడి హోలీ మామూలుగా లేదుగా.. రంగులు చల్లకుండా ఏకంగా... వామ్మో...

హోలీ సందర్భంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఇక చిన్నపిల్లల సందడి గురించి చెప్పాల్సిన పనే లేదు. హోలీ రోజు వారిలో ఎప్పుడూ లేని ఆనందం చూడొచ్చు. రంగులు చల్లుకోవడమంటేనే సరదా.. అందులో హోలీ.. ఇంకేముందీ! ఉదయం నుంచీ రాత్రి వరకూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. రంగులు చల్లుకునే సమయంలో ఇలా వీడియో తీసి, అలా పోస్టు చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా హోలీ సందర్భంగా ఓ చిన్న పిల్లాడు రంగులు చల్లే వీడియో వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో హోలీ సందర్భంగా కొందరు చిన్న పిల్లలు, పెద్దలు గుంపుగా చేరి రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ పిల్లాడి వద్ద రంగులు అయిపోతాయి. దీంతో అతడి మీద అంతా రంగులతో దాడి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా.. తిరిగి వారి మీద రంగులు చల్లి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ బుడ్డోడు కూడా అలాగే చేయాలని చూశాడు. కానీ అతడి వద్ద రంగులు మాత్రం లేవు. ఏం చేయాలా అని ఆలోచించి, చివరకు పక్కనే ఉన్న మురికి కాలువ వద్దకు వెళ్లాడు. తన వద్ద ఉన్న గన్‌తో మురికి నీరు మొత్తం లాక్కున్నాడు. పక్కన ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారంతా అలా ఆలోచిస్తుండగానే.. మురికినీటిని వారిపై స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు. దెబ్బకు అంతా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..





Updated Date - 2022-03-20T03:01:13+05:30 IST