ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసిన కేంద్రం

ABN , First Publish Date - 2022-05-16T06:19:15+05:30 IST

కేంద్రప్రభుత్వం మతోన్మాదం మాటున ప్రజా సంక్షేమం గాలికి వదిలేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికం టి సత్యం అన్నారు.

ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసిన కేంద్రం
మహాసభలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి సత్యం

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

మిర్యాలగూడ, మే 15: కేంద్రప్రభుత్వం మతోన్మాదం మాటున ప్రజా సంక్షేమం గాలికి వదిలేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికం టి సత్యం అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పా ర్టీ మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని మరిచిన పాలకులు ప్రజల భావోద్వేగాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా దోచి పెట్టేందుకు రెడ్‌ కార్పెట్‌ పరిచారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలుచేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి, డ బుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పంట రుణమాఫీ హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం సీపీఐ పోరాడుతుందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదలకు సామాజిక న్యా యం అందకుండా చేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేష న్లు సామాజిక వర్గాల వారీగా దక్కకుండా ఎత్తి వేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ జూన 3,4 తేదీల్లో మునుగోడులో జరిగే పార్టీ జి ల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పార్టీ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. బిల్ల కనకయ్య అ ధ్యక్షత వహించిన సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గు రిజ రామచంద్రం, మండల కార్యదర్శి గోగుల యాదగిరి, సహ కా ర్యదర్శి సింహాద్రి, సయీద్‌, బంటు రాజేశ్వరి, దుర్గమ్మ,  అంజయ్య, సైదమ్మ, షమీల, శ్రీను, నగేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T06:19:15+05:30 IST