రావణ దహనాన్ని అడ్డుకున్న ఒక వర్గం

ABN , First Publish Date - 2021-10-17T07:06:12+05:30 IST

దసరా పండుగ రోజున చిట్యాల మం డలం గుండ్రాంపల్లిలో శుక్రవారం దసరా ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్ష ణ తలెత్తి చిలికిచిలికి గాలివానలా మారింది.

రావణ దహనాన్ని అడ్డుకున్న ఒక వర్గం

గుండ్రాంపల్లిలో ఇరువర్గాల ఘర్షణ


 లాఠీచార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు 

పరిస్థితిని సమీక్షించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

చిట్యాల రూరల్‌, అక్టోబరు 16: దసరా పండుగ రోజున చిట్యాల మం డలం గుండ్రాంపల్లిలో శుక్రవారం దసరా ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్ష ణ తలెత్తి చిలికిచిలికి గాలివానలా మారింది. ఈఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దసరా వేడుక ల్లో భాగంగా గుండ్రాంపల్లిలో స్థానిక శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద బీజేపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏర్పాట్లు చేసి దిష్టిబొమ్మను తీసుకువస్తుండగా గ్రామానికి చెందిన కొందరు జైభీం అంటూ నినాదాలు చేస్తూ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయొద్దని అడ్డుకుని వారించారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని అడ్డుకోవడం తగదని బీజేపీ, అనుబంధసంఘం నాయకులు మరో వర్గం వారితో చెప్పగా రావణ దిష్టిబొమ్మను దహనం చేయోద్దంటూ అడ్డుకుని దిష్టిబొమ్మను చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పాటు తోపులాట జరిగింది. స్థానిక కూడలీలో జైశ్రీరాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా ఘర్షణలో గుర్తుతెలియని వ్యక్తులు జైభీం అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ నాయకుడు గరిషె రవికాంత్‌పై పెట్రోల్‌ను చల్లడం తో ఒక్కసారిగా ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. పెట్రోల్‌ పడిన రవికాంత్‌ కొం త అస్వస్థకు గురికాగా స్థానిక ఆలయంలోకి తీసుకెళ్లారు. ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు ఘర్షణ పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి ఘర్షణలు పురావృతంకాకుండా నార్కట్‌పల్లి ఎస్‌ఐ యాదయ్య, చిట్యాల ఏఎ్‌సఐ నర్సిరెడ్డిలు పోలీసులతో బందోబస్తును నిర్వహించారు. ఘర్షణ సమాచారాన్ని తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ జి. వెంకటేశ్వరరెడ్డి గుండ్రాంపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చి ప్రత్యేకంగా బందోబస్తును పెంచారు. పోలీసులు స్థానికులను ఘర్షణకు దారితీసిన పరిస్థితులను అడి గి తెలుసుకుని ఇలాంటివి పురావృతంకాకుండా శాంతియుతంగా ఉండాలని డీఎ్‌సపీ సూచించారు. ఇదిలా ఉండగా స్థానికంగా కొంతమంది రావణ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీబ్యానర్‌ను ఏర్పాటు చేయగా దానితోపాటు ఇతర ఫ్లెక్సీ బ్యానర్‌లను కూడా డీఎ్‌సపీ వాటిని తొలగింపజేశారు.

రావణ దిష్టిబొమ్మ దహనం చేసిన గ్రామస్థులు

చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో శనివారం గ్రామంలో రావణుడి దిష్టి బొమ్మను ఊరేగించి దహనం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామం లో రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయొద్దంటూ ఘర్షణ జరగడంతో గ్రామ స్తులు శనివారం ఊరేగింపును నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో బీజేపీ, అనుబంధ సంఘాలకు చెందిన వారు, గ్రామస్తులు భారీఎత్తున ఊరేగింపులో పాల్గొని అనంతరం దహనం చేశారు.

Updated Date - 2021-10-17T07:06:12+05:30 IST