పేదల ఇల్లు కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T05:18:39+05:30 IST

అక్రమంగా ఇళ్లు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ బాఽధితులతో కలిసి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పేదల ఇల్లు కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి
అక్రమంగా కూల్చిన ఇల్లు

రైల్వేకోడూరు(రూరల్‌) అక్టోబరు 1:  అక్రమంగా ఇళ్లు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ బాఽధితులతో కలిసి  శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నరసరాంపేటలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇనయతుల్లా బాషా, కె. ధనమ్మ ఇళ్లు నిర్మించుకుని 40 ఏళ్లుగా నివాసముంటున్నారు. ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారు. వీరి ఇళ్లకు పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కొంతమంది వచ్చి ఇల్లు కూల్చాలని చేసిన ప్రయత్నాలను స్ధానికులు అడ్డుకోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోయారు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి అక్రమంగా ఇల్లు కూల్చి వేసినట్లు తెలిపారు. ఇల్లు కూల్చిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం అందజేసి, ఇల్లు నిర్మించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ మండల కన్వీనర్‌ దాసరి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:18:39+05:30 IST