కాల్వలో పడిన వృద్ధుడిని రక్షించారు..

ABN , First Publish Date - 2021-04-11T06:42:51+05:30 IST

అమలాపురం ప్రధాన పంటకాల్వను ఆనుకుని ఉన్న విత్తనాలవారి కాల్వలో పడి శనివారం ఓ వృద్ధుడు కేకలు వేస్తుండడంతో స్థానికులు రక్షించారు.

కాల్వలో పడిన వృద్ధుడిని రక్షించారు..

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 10: అమలాపురం ప్రధాన పంటకాల్వను ఆనుకుని ఉన్న విత్తనాలవారి కాల్వలో పడి శనివారం ఓ వృద్ధుడు కేకలు వేస్తుండడంతో స్థానికులు రక్షించారు. కామనగరువులోని స్నేహిత స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి సమీపంలో  ఓ వృద్ధుడు పంటకాల్వలో పడి కేకలు వేస్తుండగా సంస్థ డైరెక్టర్‌ కుంచే స్వర్ణలత, శ్రీనివాసరావు  దంపతులు గుర్తించి స్థానికుల సహకారంతో ఆ వృద్ధుడిని రక్షించి బయటకు తీశారు.  అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని 108లో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని రక్షించిన స్వర్ణలత దంపతులను పలువురు అభినందించారు. 


Updated Date - 2021-04-11T06:42:51+05:30 IST