కేటీఆర్‌ నాయకత్వంలో ఉజ్వల భవిష్యత్‌

ABN , First Publish Date - 2021-07-25T05:54:24+05:30 IST

టీఆర్‌ నాయకత్వంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని టీఏఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెపు శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు.

కేటీఆర్‌ నాయకత్వంలో ఉజ్వల భవిష్యత్‌

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 24: కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని టీఏఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెపు శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. శనివారం దండు మల్కాపురం గ్రీన్‌ ఇండస్ర్టీయల్‌ పార్క్‌లో మొక్కలు నాటిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశవిదేశాల నుంచి తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు రప్పించడంలో, బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలు కృషిచేస్తున్న ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అడవుల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఒకేరోజు మూడు కోట్ల మొక్కలు నాటడం చారిత్రాత్మక విషయమన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కేటీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్‌, చిట్టంపల్లి శ్రీనివాస్‌, పెద్దిటి బుచ్చిరెడ్డి, కంది లక్ష్మారెడ్డి, ఉప్పు కృష్ణ, పెద్దిటి చంద్రారెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులున్నారు.


ఇండస్ర్టీయల్‌ పార్క్‌లో మొక్కలు నాటిన కలెక్టర్‌, చైర్మన్‌లు

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ర్టియల్‌పార్క్‌లో శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్‌ చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా పార్క్‌లో కలెక్టర్‌ పమేలాసత్పథి, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెపు శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు మొక్కలునాటారు. అనంతరం పార్క్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌, టిఫ్‌ చైర్మన్‌ కొండవీటి సుధీర్‌రెడ్డి, టీఎ్‌సఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శారద, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు వెల్వర్తి యాదగిరి, రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, గుర్రం కొండల్‌, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాస్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పిల్లలమర్రి శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.


శేషరాజుకుంటను పటిష్టం చేయాలి 

దండుమల్కాపురంలోని శేషరాజుకుంట కట్టకు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి పటిష్టం చేయాలని దండుమల్కాపురం సర్పంచ్‌ వెల్వర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివా్‌స, ఉపసర్పంచ్‌ మల్కాజిగిరి కృష్ణ, వార్డు సభ్యులు దేప శ్యామ్‌లు కలెక్టర్‌ పమేలాసత్పథికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో కుంట నిండి అలుగు పోస్తుందని, కట్ట పటిష్టం లేకపోవడంతో, నీరు లీక్‌ అవుతున్నాయన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:54:24+05:30 IST