Viral Video: అందంగా ముస్తాబైన వధువు.. పెళ్లి మంటపంలోకి అలా ఎంట్రీ ఇవ్వడాన్ని చూసి ముక్కున వేలేసుకున్న స్థానికులు!

ABN , First Publish Date - 2022-07-09T16:45:45+05:30 IST

ఓ వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి.. దేవకన్యలో ముస్తాబై.. పెళ్లి మంటపంలోకి వెరైటీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె ఎంట్రీని చూసి స్థానికులు ముక్కున వేలేసుకోవమే కాకుండా.. ‘కాలం మారిపోయింది’ అంటూ

Viral Video: అందంగా ముస్తాబైన వధువు.. పెళ్లి మంటపంలోకి అలా ఎంట్రీ ఇవ్వడాన్ని చూసి ముక్కున వేలేసుకున్న స్థానికులు!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి.. దేవకన్యలో ముస్తాబై.. పెళ్లి మంటపంలోకి వెరైటీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె ఎంట్రీని చూసి స్థానికులు ముక్కున వేలేసుకోవమే కాకుండా.. ‘కాలం మారిపోయింది’ అంటూ గునుక్కున్నారు. ఆ పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ ఎంట్రీ అదిరిపోయిందిగా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ముమూర్తం సమయానికి పెళ్లి కూతురు ఓ నలుగురు స్నేహితుల నడుమ సిగ్గు పడుతూ మంటపానికి వచ్చి.. పెళ్లి పీటలపై కూర్చునేది. అయితే అదంతా గతం. ఇప్పుడు కాలం మారింది. జీవితంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉన్నందున దాన్ని వీలైనంత మధుర అనుభూతిగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు.. ఉత్సాహంగా డ్యాన్సులేస్తూ వివాహ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. అయితే.. అది కూడా ఇపుడు రొటీన్‌గా మారిపోవడంతో.. ఓ వధువు కొత్తదనాన్ని కోరుకుంది. ఈ నేపథ్యంలోనే అందంగా అలంకరించుకున్న ఆమె.. వెరైటీగా మంటపంలోకి అడుగు పెట్టింది. గుర్రంపై కూర్చుని.. ఊరేగుతూ పెళ్లి వేధిక వద్దకు చేరుకుంది. గుర్రంపై వధువు వెళ్లడాన్ని చూసి.. స్థానికులు షాకయ్యారు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఫిదా అవుతున్నారు. ‘సూపర్.. ఎంట్రీ అదిరిపోయిందిగా’ అని కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-09T16:45:45+05:30 IST