ప్రకాశం: జిల్లాలోని కంభం పట్టణంలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ప్రభుత్వ హాస్పటల్ సమీపంలో ఓ ఇంటి బాత్రూంలో దాచిన నాటు బాంబుని వీధి కుక్క కొరికింది. దీంతో బాంబు పేలడంతో కుక్క అక్కడిక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.