వామ్మో.. ఒక్క ఏడాదిలోనే ఆ ఇంటితో ఏకంగా రూ.631 కోట్ల లాభమా..? ఆశ్చర్యపోతున్న Americans

ABN , First Publish Date - 2022-06-17T02:02:43+05:30 IST

ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల ధరలు ఒక్కరాత్రిలో ఆకాశాన్నంటిన ఘటనలు మన గతంలో అనేకం చూశాం. ఆయా సమయాల్లో తమ ఆస్తులు అమ్మిన వారు భారీ లాభాలు కూడా కళ్ల చూశారు. కానీ.. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ డీల్ దాదాపు..

వామ్మో.. ఒక్క ఏడాదిలోనే ఆ ఇంటితో ఏకంగా రూ.631 కోట్ల లాభమా..? ఆశ్చర్యపోతున్న Americans

ఎన్నారై డెస్క్: ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల ధరలు ఒక్కరాత్రిలో ఆకాశాన్నంటిన ఘటనలు మన గతంలో అనేకం చూశాం. ఆయా సమయాల్లో తమ ఆస్తులు అమ్మిన వారు భారీ లాభాలు కూడా కళ్ల చూశారు. కానీ.. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ డీల్ దాదాపు 81 మిలియన్ డాలర్ల లాభాన్ని తెచ్చి పెట్టింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ. 631 కోట్లు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ డీల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ప్రఖ్యాత వ్యాపారవేత్త జిమ్ కార్క్‌కు పామ్ బీచ్‌లో 16 ఎకరాల స్థలం ఉంది. ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్ కోర్స్ ఉన్న ఆ స్థలం మధ్యలో ఓ భారీ బంగళా కూడా ఉంది. ప్రకృతి అందాల నడుము ఉన్న బంగళా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భూతల స్వర్గం. గతేడాదే క్లార్క్ ఆ ఇంటిని 94.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఎక్కువ సమయం ఫ్లోరిడాలోనే ఉండాల్సి వస్తుందన్న తలంపుతో ఆయన దీన్ని కొనుగోలు చేశారు.


కానీ అప్పటి ప్రణాళికల్లో మార్పులు రావడంతో క్లార్క్ ఆ ఇంటిని తాజాగా అమ్మకానికి పెట్టగా.. ఓ వ్యక్తి 175 మిలియన్ డాలర్లకు కొనేందుకు సిద్ధమయ్యారు. అంటే.. ఈ డీల్ ద్వారా ఒక్క ఏడాదిలో క్లార్క్‌కు దాదాపు 81 మిలియన్ డాలర్ల లాభం వచ్చిందన్నమాట. అయితే..దీన్ని కొనుగోలు చేసింది ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక లగ్జరీ నివాసాలు అధికంగా ఉండే పామ్‌బీచ్‌లో ఇదే అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్‌గా నిలువనుందని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా తెలిపింది. ఈ వారం చివర్లోనే ఈ డీల్‌కు సంబంధించిన రాతకోతలు పూర్తి చేస్తామని క్లార్క్ చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-06-17T02:02:43+05:30 IST